నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటిస్తున్న చిత్రం రంగబలి. పవన్ బాసంశెట్టి దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రతీ మనిషి పేరు మీద సొంతిల్లుండకపోవచ్చు. సొంత పొలం ఉండకపోవచ్చు.. కానీ సొంతూరు మాత్రం ఉంటది.. అంటూ ఊరు ప్రాముఖ్యత గురించి చెబుతున్న డైలాగ్స్‌తో షురూ అయింది ట్రైలర్. బయట ఊరిలో బానిసలా బతికినా ఫర్వాలేదు భయ్యా.. కానీ సొంతూరులో మాత్రం సింహంలా ఉండాలంటున్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్, ఫ్యామిలీ ట్రాక్‌తో సినిమా వినోదాత్మకంగా సాగనున్నట్టు ట్రైలర్‌తో చెప్పేశాడు డైరెక్టర్.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-263.jpg)
ఈ చిత్రం లో సత్య, అనంత్ శ్రీరామ్, గోపరాజు రమణ, కల్యాణి నటరాజన్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, సప్తిగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి, భద్రం, శివనారాయణ, పీకే, పవన్, నోయెల్, రమేశ్ రెడ్డి, హరీష్ చంద్ర, బ్రహ్మాస్త్రి, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-262.jpg)
ఈ సం దర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రంలో నాగశౌర్య అద్భుతమైన నటనతో ఆకట్టుంటాడు. తన ఎనర్జిటిక్ పర్‌ఫార్మెన్స్ చిత్రానికి ప్లస్ అవుతుంది అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ ఈసినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాం. దర్శకుడు పవన్ చిత్రాన్ని అందరికి నచ్చే విధంగా తెరకెక్కించాడు. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం అన్ని ఉన్నతంగా ఉంటాయి అన్నారు. వచ్చే నెల 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రా నుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-261.jpg)