Namaste NRI

ఓ సాహస యాత్రలా.. గామి

విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా విద్యాధర్‌ కాగిత దర్శకత్వంలో రూపొందిన చిత్రం గామి. చాందిని చౌదరి కథానాయిక.  ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువ హీరో అడివి శేష్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విశ్వక్‌సేన్‌ నిజాయితీగా చేసిన ఈ ప్రయత్నం విజయ వంతం కావాలని ఆకాంక్షించారు. విశ్వక్‌సేన్‌ మాట్లాడుతూ ఈ సినిమా చూసినప్పుడు మనసు బరువెక్కింది. గొప్ప సినిమా చేశానని గర్వంగా అనిపించింది. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఈ కథ ప్రేక్షకుల్ని వెంటాడు తుంది అన్నారు.  ఈ సినిమా కోసం చాలా రిస్క్‌లు తీసుకున్నాం.

మా కష్టానికి తగిన ఫలితం లభిస్తుందనే నమ్మకం ఉంది. కొత్తరకం సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా గొప్ప సంతృప్తినిస్తుంది. గామి ప్రేక్షకాదరణతో గమ్యాన్ని చేరుతుందనే నమ్మకం ఉంది అన్నారు. షూటింగ్‌ మొత్తం ఓ సాహస యాత్రలా జరిగిందని, సాంకేతికంగా ప్రతీ అంశం ఉన్నతంగా ఉంటుందని, చరిత్రలో నిలిచిపోయే చిత్రమవుతుందని దర్శకుడు విద్యాధర్‌ కాగిత తెలిపారు. ఈ కార్యక్రమంలో నవదీప్‌, అజయ్‌భూపతి, ఎస్‌కేఎన్‌, వశిష్ట తదితరులు పాల్గొన్నారు. నేడు ఈ  చిత్రం  ప్రేక్షకుల ముందుకురానుంది.  

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events