విశాల్ హీరోగా ఏ. వినోద్‌కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్ పై రాబోతున్న చిత్రం లాఠీ. పాన్ఇండియా మూవీగా రూపొందింది. సునైనా హీరోయిన్గా నటించింది. రమణ, నంద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు మోహన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాల్ కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. అతని సినిమాలన్నీ బాగుంటాయి. నేను పోలీస్ అనే పదాన్ని గౌరవిస్తాను. విశాల్ ఓ గొప్ప కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. పందెంకోడి తరహాలో ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది అన్నారు. విశాల్ మాట్లాడుతూ నేను హీరో అవుతానని మా నాన్నతో చెప్పిన మొదటివ్యక్తి మోహన్‌బాబుగారు. ఆనాడు ఆయన చెప్పిన మాటలు నిజమయ్యాయి. లాఠీ కానిస్టేబుల్ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. వాళ్లు నిజ జీవిత హీరోలు. అందరి స్ఫూర్తినిచ్చే కథతో ఈ సినిమా ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది అన్నారు. ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)