ప్రగ్యా నయన్, సంపత్, అజయ్ ఘోష్, సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా సురాపానం. కిక్ అండ్ ఫన్ అనేది శీర్షిక. థ్రిల్లర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సంపత్ కుమార్ నటిస్తూ, తెరకెక్కించారు. అనుకోకుండా చేసిన ఒక పొరపాటు వల్ల కథానాయకుడు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది సినిమాలో చూపిస్తున్నాం. థ్రిల్లింగ్, హ్యూమర్ అంశాలు ఆకట్టుకుంటాయి అని అన్నారు దర్శక నిర్మాతలు. చమ్మక్ చంద్ర, విద్యాసాగర్, అంజిబాబు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై మట్ట మధు యాదవ్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విజయ్ ఠాగూర్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)