Namaste NRI

వలసదారులకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలు

 బ్రిటన్‌లో  వలసదారులకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. నార్త్ వెస్ట్ ఇంగ్లండ్‌లో  నిరసనకారుల ప్రదర్శన నేపథ్యంలో హింస చెలరేగింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం, ఒక వలసదారు స్థానిక అమ్మాయిని వేధించాడని ఆరోపణలు వచ్చాయి. దాంతో అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత ఓ 20 ఏండ్ల యువకుడిని అరెస్టు చేశారు. అయితే, బాలల సంరక్షణ సేవా సంస్థ ఆదేశాల మేరకు అతడిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో స్థానికులు వలసదారులకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేపట్టగా, అది కాస్తా హింసాత్మకంగా మారింది. పోలీసులపై ఆందోళనాకారులు రాళ్లు రువ్వారు. ఓ పోలీసు వ్యానుకు నిప్పుపెట్టారు. వీరి దాడిలో పోలీసుతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. హింసాత్మక సంఘటనలను అడ్డుకునేందుకు మెర్సీసైడ్ పోలీసులు దాదాపు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన లివర్పూల్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న నోస్లీ అనే గ్రామంలో జరిగింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events