కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనాలో గత కొన్ని రోజులుగా మళ్లీ వైరస్ విజృంభిస్తోంది. అక్కడ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈశాన్య నగరమైన చాంగ్‌చున్‌లో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు అక్కడ లాక్‌డౌన్ విధించారు. 90 లక్షల జనాభా ఉన్న ఆ నగరంలో కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్థానికులు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దను ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఫ్యామిలీ సభ్యుల్లో ఒకరే నిత్యావసరాల కోసం బయటకు వెళ్లాలి. అది కూడా రెండు రోజులకు ఒకసారి మాత్రమే. నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ మూడు సార్లు కరోనా పరీక్షలను చేయించుకోవాలి. అత్యవసరం కాని సేవల్ని రద్దు చేశారు. ట్రాన్స్‌పోర్ట్ లింకులను కూడా మూసివేశారు. యుచెంగ్ నగరంలో కూడా ఆంక్షలు అమలులో ఉన్నాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)