Namaste NRI

ప్రేమికుల రోజున లాంగ్ కిస్.. గిన్నిస్ రికార్డుల్లో జంట

దక్షిణాఫ్రికాకు చెందిన బెత్ నీల్, కెనడాకు చెందిన మైల్స్ క్లౌటియర్ ప్రేమికులు. ప్రస్తుతం ఇద్దరూ దక్షిణాఫ్రికాలో ఉంటున్నారు. ఈ క్రమంలో వాలెంటైన్స్ డే రోజున నీటి అడుగులో ఎక్కువసేపు ముద్దు పెట్టుకుని గిన్నిస్ రికార్డు సృష్టించాలని వారు నిర్ణయించుకున్నారు. అందుకోసం గత కొన్ని వారాల నుంచి మాల్దీవ్స్‌లో  బాగా సాధనచేశారు. ఇవాళ మాల్దీవ్స్‌లోనే  నీలి రంగు దస్తుల్లో ఓ పూల్ అడుగు భాగంలో మోకాళ్లపై కూర్చుని ఏకంగా 4 నిమిషాల 6 సెకన్ల పాటు ముద్దు పెట్టుకున్నారు. దాంతో ఇప్పటివరకు 3 నిమిషాల 24 సెకన్లుగా ఉన్న గిన్నిస్ రికార్డు బద్ధలైంది. 13 ఏండ్ల క్రితం మిచెల్ ఎలీసా జంట నెలకొల్పిన 3 నిమిషాల 24 సెకండ్ల అండర్ వాటర్ కిస్ రికార్డును అధిగమించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress