Skip to main content

Namaste NRI

బీఎస్‌ఎస్‌12 నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న డివైన్‌, యాక్షన్‌ అడ్వెంచర్‌ బీఎస్‌ఎస్‌ 12 (వర్కింగ్‌ టైటిల్‌). సుధీర్‌రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మహేష్‌ చందు నిర్మాత. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రెండుకాళ్లు సీటుపై పెట్టి ధైర్యంగా బైక్‌ నడుపుతూ అడ్వెంచర్‌ అవతార్‌లో బెల్లంకొండ సాయి కనిపిస్తున్నా రు. అతని వెనుక ఒక కొండ,  ఆ కొండపై రగులుతున్న విష్ణు నామాలు చూడొచ్చు. 400ఏళ్ల నాటి దశావతార ఆలయం నేపథ్యంలో సాగే యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ఇదని, బెల్లంకొండ సాయి కెరీర్‌లోనే హయ్యెస్ట్‌ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతున్నదని, 35శాతం షూటింగ్‌ పూర్తయిందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర, సంగీతం: లియోన్‌ జేమ్స్‌, నిర్మాణం: మూన్‌షైన్‌ పిక్చర్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events