ప్రపంచంలో రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్ కలిసి పనిచేయాలని, ఇరు దేశాల నడుమ రక్షణ, ఆర్థికపరమైన భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని బ్రిటన్ నూతన ప్రధానమంత్రి రిషి సునాక్ ఆకాంక్షించారు. రెండు దేశాలు కలిసికట్టుగా సాధించబోయే ఘనత కోసం తాను ఉత్పుకతతో ఎదురు చూస్తున్నానని తెలిపారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తనను అభినందించినందుకు గాను ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. మోదీ పోన్‌లో రిషి సునాకత్‌తో మాట్లాడి, అభినందించారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి మేమిద్దరం కలిసి పనిచేస్తాం. సమగ్ర, సమతుల్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవాలని అంగీకారానికి వచ్చాం అని మోదీ తెలిపారు.
