ప్రణవి పిక్చర్స్ పతాకంపై ఎస్ ఎమ్ వి ఐకాన్ ఫిలిమ్స్ సంస్థ నిర్మాణంలో అనిత మరియు ప్రఖ్యాత్ సమర్పిస్తున్న చిత్రం లాట్స్ ఆఫ్ లవ్. ఈ చిత్ర ఆడియో కార్యక్రమాన్ని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ గీతావిష్కరణ మహోత్సవానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లు రామకృష్ణ, దర్శకుడు వీరశంకర, జెడి మోహన్ గౌడ్, ప్రసన్నకుమార్, ప్రతాని రామకృష్ణ గౌడ్, శ్రీరంగం సతీష్‌లు హాజరయ్యారు. టిప్స్ తెలుగు మ్యూజిక్ ద్వారా ఒక్కొక్కరు ఒక్కో గీతాన్ని విడుదల చేశారు. టీజర్‌ను నటి అనిత షిండే మరియు ట్రైలర్‌ను మిస్ ఊటీ అనన్య అగర్వాల్ విడుదల చేశారు. అనంతరం ముఖ్య అతిథి కొల్లు రామకృష్ణ మాట్లాడుతూ ఈ చిత్రానికి దర్శకత్వం వహించి నటించి నిర్మించిన వివ్వ సాఫ్ట్ వేర్ రంగం నుంచి చిత్ర రంగానికి మంచి ఫ్యాషన్‌తో వచ్చారు. ఈ లాట్స్ ఆఫ్ లవ్ మూవీని చేశారు. ట్రైలర్, సాంగ్స్, టీజర్ చాలా బాగున్నాయి. ఈ సినిమాతో అందరికీ మంచి పేరు రావాలని ఆశిస్తునా అన్నారు. కొల్లు రామకృష్ణ, శ్రీరంగం సతీష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ డాక్టర్ బికె కిరణ్ కుమార్, దర్శక నిర్మాత విశ్వానంద్, చిత్ర సమర్ఫకులు అనిత, ప్రఖ్యాత్‌తో పాటు విహాంత్, రాజేష్, భావన, గుండు శ్రీనివాస్, మాధవి తదితరులు పాల్గొన్నారు.
