విశ్వానంద్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా లాట్స్ ఆఫ్ లవ్. ఆద్య, నిహాంత్, దివ్య, రాజేష్, భావన ఇతర నాయకానాయికలు. ప్రణవి పిక్చర్స్, ఎస్ఎంవీ ఐకాన్ ఫిలింస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. అనిత, ప్రఖాత్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు.ఈ సందర్భంగా దర్శక నిర్మాత నటుడు విశ్వనంద్ మాట్లాడుతూ ఐదు కథల సమాహారం ఈ సినిమా. ప్రేమకు అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మహిళలు, పిల్లలు ఇష్టపడేలా ఉంటుంది. పాటలు బాగుంటాయి అన్నారు. పేరుకు తగ్గట్టే చాలా ప్రేమని నింపుకుని చేసిన చిత్రమిది. కథలోనూ ఆ ప్రేమ కనిపిస్తుంది అన్నారు కథానాయకుల్లో ఒకరైన రాజేష్. తెలుగు రాష్ట్రాల్లో వంద థియేటర్లల్లో, అమెరికాలో 4 థియేటర్లలో విడుదల చేస్తున్నామని సినీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 30న సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ కార్యక్రమంలో శ్రీరంగం సతీష్, ప్రతిపాటి శ్రీనివాసరావు, సోమేశ్వర్రాజు, ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విశ్వ. కెమెరా: మురళీ, నగేష్, కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డా. బీకే.కిరణ్ కుమార్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)