మేఘశ్యామ్, రేఖ నిరోష జంటగా రూపొందిన చిత్రం వాస్తవం. జీవన్ బండి దర్శకుడు. ఆదిత్య ముద్గల్ నిర్మాత. హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఖర్చుకు వెను కాడకుండా ఇష్టంతో ఈ సినిమా చేశాం. హీరోహీరోయిన్లు మేఘశ్యామ్, రేఖా నిరోషా చాలా బాగా నటించారు. పి.ఆర్.అందించిన సంగీతానికి మంచి స్పందన వస్తున్నది. సినిమా తప్పక విజయం సాధిస్తుందని నమ్మకం తో ఉన్నాం అని నిర్మాత చెప్పారు. ఈ సినిమాలోని ప్రతి పాత్రా గుర్తుండిపోతుందని, నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ సహకరించడంవల్లే సినిమా ఇంతబాగా వచ్చిందని, సినిమా తప్పక సక్సెస్ అవుతుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో నటించడం పట్ల హీరోహీరోయిన్లు ఆనందం వ్యక్తం చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)