Skip to main content

Namaste NRI

లవ్ మీ రిలీజ్ డేట్ ఖరారు

ఆశిష్‌, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం లవ్‌ మీ. అరుణ్‌ భీమవరపు దర్శకుడు. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. ఇఫ్‌ యు డేర్‌ ఉపశీర్షిక. ఈ సందర్భంగా రిలీజ్‌ డేట్‌ ను ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. తెలుగు తెరపై ఇప్పటివరకూ రానటువంటి విభిన్నమైన ప్రేమ కథాంశమిది. ఓ ఆత్మ తాలూకు ప్రేమకథగా ఉత్కంఠను పంచుతుంది. దర్శకుడు తన నిజ జీవితంలో చూసిన సంఘటనల స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నాడు. హారర్‌ అంశాలతో పాటు అంతర్లీనంగా హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలుంటాయి అని చిత్ర బృందం పేర్కొంది.  ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: పీసీ శ్రీరామ్‌, ఆర్ట్‌: అనివాష్‌ కొల్లా, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, దర్శకత్వం: అరుణ్‌ భీమవరపు.

Social Share Spread Message

Latest News