నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ నేపథ్యంలో మ్యూజికల్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. యూనిట్‌తో కింగ్ నాగార్జున, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు కెఎస్ రామరావు, డి.సురేష్‌బాబు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఈ చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాదు దేశ సినిమా పరిశ్రమకే మంచి ఉత్సాహాన్ని అందించిందన్నారు. ఒక మంచి సినిమా ఇస్తే థియేటర్లకు వస్తామని తెలుగు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారన్నారు. లవ్‌స్టోరీ ఒక నాంది అన్నారు. దసరా, సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేసుకునేందుకు ధైర్యం వచ్చిందన్నారు. ప్రతి ఫిల్మ్ మేకర్ లవ్‌స్టోరీ విజయం వల్ల సంబరాలు చేసుకున్నారని అన్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి ప్రస్తావిస్తూ మీ మానవ్తం సూపర్బ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నారాయణదాస్ నారంగ్, ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు, గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరోయిన్ సాయిపల్లవి, హీరో నాగచైతన్య తదితరులు మాట్లాడారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)