విజయ్ ఆంటోనీ తెలుగులో నటిస్తున్న తాజా చిత్రం లవ్ గురు. మృణాళినీ రవి హీరోయిన్ గా నటిస్తోంది. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ గురు సినిమాను తన బ్యానర్ గుడ్ డెవిల్ లో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు హీరో విజయ్ ఆంటోనీ. ఆయనను రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో చూడాలనుకునే అభిమానుల కోరికను ఈ సినిమా తీర్చనుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ ఆంటోనీ, మృణాళినీ రవి జోడీ ఓ మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీని చూపించబోతున్న ఫీల్ ను కలిగిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి విడుదలకు ప్లాన్ చేసుకుంటోంది.
