లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ సజీవంగా ఉన్నారు. తమిళనాడు కాంగ్రెస్ మాజీ నాయకుడు, వరల్డ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ తమిళ్ పజా నేత నెడుమారన్ ఈ వాదన చేశారు. ప్రభాకరన్ చనిపోయాడన్న ప్రకటన పూర్తిగా అబద్ధమని, తాను సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు తనతో చెప్పారన్నారు. పాలా కోయంబత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభాకరన్‌కు సంబంధించి ఈ సంచలన సమాచారాన్ని వెల్లడించారు. ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకర్ చనిపోలేదని తమిళ పజా నెడుమారన్ చెప్పారు. ఆయన చనిపోయినట్లు వచ్చిన ప్రకటన శుద్ధ అబద్ధమన్నారు. ఆరోగ్యంగా ఉన్నానని ఆయనే తనతో చెప్పారని వెల్లడించారు. ఆయనే స్వయంగా చెప్పడంతో చనిపోయాడన్న పుకార్లకు తెరపడుతుందని నమ్ముతున్నామన్నారు. త్వరలో ప్రభాకరన్ ప్రపంచం ముందుకు వస్తాడని కూడా తెలిపారు. ప్రభాకరన్ నేతృత్వంలోనే మళ్లీ ఈలం యుద్ధం ప్రారంభమవుతుందని కూడా చెప్పారు. వేలుపిళ్లై ప్రభాకరన్ చనిపోయినట్లు శ్రీలంక ప్రభుత్వం 2009 మే 18న ప్రకటించింది. ప్రభాకరన్ మృతదేహాన్ని ఎల్టీటీఈ మాజీ నాయకుడు కరుణ అమ్మన్ కూడా అప్పట్లో గుర్తించారు. కాగా, ప్రభాకరన్ ఇప్పటికీ సజీవంగానే ఉన్నారని, ఆయన కుటుంబ సభ్యులు తనకు అందుబాటులో ఉన్నారని నెడుమారన్ ప్రకటించారు. అయితే, నెడుమారన్ వాదనను శ్రీలంక ప్రజలతోసహా ఎవరూ విశ్వసించే పరిస్థితి లేదు.














