Skip to main content

Namaste NRI

అదృష్టమంటే ఈ బేబీ హిప్పోదే..క్రిస్మస్‌ సందర్భంగా

ఇంటర్నెట్‌ సెన్సేషన్‌ థాయ్‌లాండ్‌కు చెందిన బేబీ హిప్పో  మూ డెంగ్‌కు అదృష్టం వరించింది. క్రిస్మస్‌ సందర్భంగా కెనడాకు చెందిన క్రిప్టోకరెన్సీ బిలియనీర్‌  విటాలిక్‌ బుటెరిన్‌ పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చారు. ఈ బేబీ హిప్పో థాయ్‌లాండ్‌లోని సి రాచా లో గల ఖావో ఖీవ్ ఓపెన్ జూ  లో ఉంటుంది. ఈ హిప్పోకి సోషల్‌ మీడియాలో చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఐదు నెలల వయసు గల ఈ హిప్పో ఇటీవలే మైఖేల్‌ జాక్సన్‌ ఫేమస్‌ డ్యాన్స్‌ మూన్ వాక్‌తో ఇంటర్నెట్‌ సన్సేషన్‌గా మారిన విషయం తెలిసిందే. మూన్‌ వాక్‌ మూమెంట్స్‌తో ఈ హిప్పో అదరగొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అంతేకాదు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుస్తారని జోష్యం చెప్పి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే బేబీ హిప్పో దీర్ఘకాలం జీవించేందుకు కెనడాకు చెందిన క్రిప్టోకరెన్సీ బిలియనీర్‌ భారీ విరాళం ఇచ్చారు. హిప్పో సంరక్షణ కోసం జూ నిర్వాహకులు రూ.2.51 కోట్లు విరాళంగా ఇచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events