Skip to main content

Namaste NRI

సెప్టెంబర్‌ లో లక్కీ భాస్కర్‌

దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం లక్కీ భాస్కర్‌.  వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నా రు. 1980-90 దశకం నడుమ జరిగే పీరియాడిక్‌ డ్రామా ఇది. ముంబయి నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథగా మెప్పిస్తుంది. ఓ సాధారణ వ్యక్తి యొక్క అసాధారణ ప్రయాణానికి దృశ్యరూపంగా ఉంటుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉంది అని చిత్రబృందం పేర్కొంది. సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ విషయాన్ని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.  ఈ చిత్రానికి కెమెరా: నిమిష్‌ రవి, సంగీతం: జీవీ ప్రకాష్‌ కుమార్‌, రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి.

Social Share Spread Message

Latest News