లాటిన్ అమెరికా ఖండంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన బ్రెజిల్ రాజకీయాల్లో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. హోరాహోరీగా సాగిన అధ్యక్ష ఎన్నికల పోరులో దిగ్గజ నాయకుడు, బ్రెజిల్ ప్రస్తుత అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డ సిల్వా ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వామపక్ష నాయకుడైన లూలా, తన ప్రత్యర్థి, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కుమారుడు, సెనేటర్ ఫ్లావియో బోల్సోనారో ను ఓడించారు. తద్వారా బ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

సుపీరియర్ ఎలక్టోరల్ కోర్ట్ విడుదల చేసిన అధికారిక ఫలితాల ప్రకారం..లూలా డ సిల్వాకు 51.8 శాతం ఓట్లు రాగా, బోల్సోనారోకు 48.2 శాతం ఓట్లు దక్కాయి. దాదాపు 40 లక్షల ఓట్ల తేడాతో లూలా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.















