రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న సినిమా నరకాసుర. ఈ చిత్రానికి సెబాస్టియన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుంచి రెండో సాంగ్ గ్రీవము యందునను కిరణ్ అబ్బవరం లాంఛ్ చేశాడు. శంకర్ మహదేవన్ పాడిన ఈ పాట సినిమాకు హైలెట్‌గా నిలిచిపోయేలా కనిపిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన నిన్ను వదిలి పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి నాఫాల్ రాజా ఏఐఎస్ సంగీతం అందిస్తున్నారు.హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ భామ సంగీర్తన విపిన్, అపర్ణా జనార్దన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. నాజర్, శత్రు, శ్రీమాన్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిల్మ్ మేకర్ బ్యానర్లపై అజ్జా శ్రీనివాస్, కరుమూరు రఘు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 3న గ్రాండ్‌గా విడుదల కానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/10/Greevamu-Yandhuna-Song-from-696x418-1.jpg)