సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మా ఊరి పొలిమేర-2. డా॥ అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. శ్రీకృష్ణ క్రియేషన్స్ పతాకంపై గౌరీ కృష్ణ నిర్మిస్తున్నారు. సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర దర్శకుడు హరీష్‌శంకర్, హీరో కార్తికేయ, నిర్మాత బన్నీ వాసు సంయుక్తంగా ఆవిష్కరించారు. పొలిమేర చిత్రం తనకు బాగా నచ్చిందని, అదే స్థాయిలో ఈ సీక్వెల్ ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకం ఉందని హరీష్‌శంకర్ అన్నారు. తొలిభాగాన్ని చూడనివారికి అర్థమయ్యేలా చక్కటి స్క్రీన్‌ప్లేతో రెండో భాగాన్ని తెరకెక్కించారని బన్నీ వాసు తెలిపారు. మొదటి భాగం కంటే వందరెట్లు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే చిత్రమిదని, ప్రతి సన్నివేశం ఆసక్తిగా సాగుతుందని దర్శకుడు పేర్కొన్నారు. నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: ఖుషేందర్ రమేష్ రెడ్డి, సంగీతం: గ్యాని, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: డా॥ అనిల్ విశ్వనాథ్. ఈ వేడుకలో ఖుషేందర్, గెటప్ శీను, కామాకి, సాహితిగ్యానీ తదితరులు పాల్గొన్నారు.