గత ఏడాది ప్రేక్షకులముందుకొచ్చిన మ్యాడ్ చిత్రం యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా మ్యాడ్ స్వేర్ తెరకెక్కనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ మరియు సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్నది. మొదటి భాగంలో నటించిన యువహీరోలు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్‌నితిన్‌లు సీక్వెల్‌లో కూడా సందడి చేయబోతున్నారు. కథా నాయికల వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు. సీక్వెల్‌లో రెట్టింపు మ్యాడ్‌నెన్ ఉంటుంది. ముగ్గురు మిత్రు లు చేసే హంగామా నవ్వుల సునామీ సృష్టిస్తుంది అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: షామ్ దత్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, దర్శకత్వం: కల్యాణ్‌శంకర్.