ఉదయ్, వైష్ణవి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం మధురం. ఈ చిత్రానికి రాజేష్ చికిలే దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై బంగార్రాజు నిర్మాత. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హీరో విశ్వక్‌సేన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ నవ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు చక్కని స్పందన వస్తున్నది. తప్పకుండా చిత్రం కూడా అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వెంకీ వీణ, సహ నిర్మాత: ప్రదీప్ కుమార్ సుప్రాణి. కొరియోగ్రాఫర్‌గా రామ్.