
ఉదయ్‌రాజ్, వైష్ణవి సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం మధురం. ఏ మెమొరబుల్ లవ్ ట్యాగ్‌లైన్. రాజేష్ చికిలే దర్శకుడు. యం.బంగార్రాజు నిర్మాత. ఇటీవల ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. 90ల కాలం నాటి స్వచ్ఛమైన ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ప్రతి ఒక్కరికి ప్రేమజ్ఞాపకాలను గుర్తుకు తెస్తుందని దర్శకుడు తెలిపారు. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇదని, యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా మెప్పిస్తుందని నిర్మాత యం.బంగార్రాజు పేర్కొన్నారు. హృద్యమైన ప్రేమకథలో భాగం కావడం ఆనందంగా ఉందని నాయకానాయికలు తెలిపారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది.
