శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నటించిన చిత్రం మది. నాగధనుష్ దర్శకత్వం వహించారు. రామ్కిషన్ నిర్మాత. పీవీ ఆర్ రాజా స్వరకర్త. హైదరాబాద్లో ట్రైలర్ విడుదల వేడుకల జరిగింది. నటుడు సుమన్, నటి ఆమని ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ని విడుదల చేశారు. దయానంద్ గుప్తు, కిరణ్, ఉపేంద్ర, గోవర్థన్ రెడ్డి, నవన రెడ్డి, జై శంకర్ తదితరులు వేడుకకి హాజరయ్యారు. నటుడు సుమాన్ మాట్లాడుతూ యువతరానికి నచ్చే మంది కథని ఎంచుకుని ఈ సినిమా చేశారు దర్శక నిర్మాతలు. హీరో హీరోయిన్ల జోడీ, నటన బాగుంది అన్నారు. పాటలు, ట్రైలర్ మదిని దోచేలా ఉన్నాయన్నారు ఆమని. మంచి కంటెంట్తో వస్తున్న ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందన్నారు. మంచి కంటెంట్తో సినిమా తీశామని నిర్మాత రామ్కిషన్ పేర్కొన్నారు. శ్రీకాంత్ జైరోజ్, స్నేహ మాధురి శర్మ, యోగి కత్రి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మిజయ్ ఠాగూర్, సంగీతం: పీవీర్ రాజా, కథ, కథనం, మాటలు, దర్శకతవ్వం : నాగ ధనుష్. ఈ కార్యక్రమంలో సహా నిర్మాత శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతర చిత్ర బృందం పాల్గొంది.