Skip to main content

Namaste NRI

టీనేజ్‌ డ్రామాగా మ్యాజిక్‌

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌  సంస్థ తెరకెక్కించిన తాజా చిత్రం మ్యాజిక్‌. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. పలువురు నూతన తారలను పరిచయం చేస్తూ టీనేజ్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. కాలేజీ ఫెస్టివల్‌ కోసం ఒక ఒరిజినల్‌ సాంగ్‌ను కంపోజ్‌ చేయడానికి నలుగురు టీనేజర్లు చేసే ప్రయత్నాల చుట్టూ కథ నడుస్తుందని, నీలగిరి ప్రకృతి అందాల నడుమ తెరకె క్కించిన సన్నివేశాలు కనులవిందుగా ఉంటాయని చిత్రబృందం పేర్కొంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు రూపొందిస్తున్నారు. ఈ వేసవిలో తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందు కురానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: గిరీష్‌ గంగాధరన్‌, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, నిర్మాతలు: నాగవంశీ, సాయిసౌజన్య, రచన-దర్శకత్వం: గౌతమ్‌ తిన్ననూరి.

Social Share Spread Message

Latest News