Namaste NRI

గంగ‌మ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మ‌హా గ‌ణేషుడు

హైదరాబాద్‌లో గణేష్‌ మహా శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. దీంతో ట్యాంక్‌బండ్‌పై సందడి మొదలైపోయింది. 9రోజులపాటు భక్తుల పూజలందుకున్న  ఖైరతాబాద్ గణనాథుడి గంగ‌మ్మ ఒడికి చేరాడు.  హ‌స్సేన్ సాగ‌ర్ వ‌ద్ద ఏర్పాటు చేసిన నాలుగో నెంబ‌ర్ భారీ క్రేన్ సాయంతో నిమ‌జ్జ‌నం కార్య‌క్ర‌మం పూర్తి చేశారు. ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్రకు చిన్నాపెద్ద తేడా లేకుండా, లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు. గణపతిబప్ప మోరియా.. ఖైరతాబాద్ గణేష్‌కు జై అంటూ డ్యాన్సులు వేస్తూ గణనాథుడ్ని సాగనంపారు. ఎటు చూసినా జనసంద్రమే, ఇసుకేస్తే రాలనంత జనంతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిటకిటలాడాయి. ఖైరతాబాద్ గణేశ్ ఎదుట భక్తులతో పాటు.. పోలీసులు కూడా డ్యాన్స్ వేసి అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీ దశమహా విద్యాగణపతిగా కొలువైన ఖైరతాబాద్ గణేశుడి శోభాయత్ర టెలిఫోన్‌ భవన్‌, సచివాలయం మీదుగా శోభాయాత్ర కొనసాగింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events