Skip to main content

Namaste NRI

కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న మహాకాళి!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సృష్టించిన హనుమాన్ సినిమాటిక్ యూనివర్స్ (పివిసియు) నుంచి రాబోతున్న తదుపరి భారీ చిత్రం మహాకాళి కీలక మైలురాయిని చేరుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 125 రోజుల పాటు సాగిన సుదీర్ఘ, భారీ షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా ముగించుకుని, ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సుదీర్ఘ షెడ్యూల్‌లో చిత్రంలోని అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా, యువ హీరో రోహిత్ సరాఫ్ తమకు సంబంధించిన షూటింగ్ భాగాలను పూర్తి చేసుకున్నారు. ఆర్.కె. దుగ్గల్ సమర్పణలో, ఆర్.కె.డి స్టూడియోస్ బ్యానర్‌పై పూజా కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ డివైన్ యాక్షన్ డ్రామాలో భూమి శెట్టి కూడా నటిస్తున్నారు. ప్రేక్షకులకు సరికొత్త దృశ్యానుభూతిని పంచేందుకు ఈ సినిమాను ప్రత్యేకంగా ఐమాక్స్ ఫార్మాట్‌లో చిత్రీకరిస్తుండటం విశేషం. అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక విడుదల తేదీతో పాటు మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ను ఇస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.

Social Share Spread Message

Latest News