Namaste NRI

యాదాద్రిలో వైభవంగా మహాకుంభ సంప్రోక్షణ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం ఫలిచింది. చరిత్రలో నిలిచిపోయేలా అద్భుతమైన యాదాద్రి దివ్యక్షేత్రం సాక్షాత్కారించింది. నవ్య యాదాద్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతికి పునరంకితం చేశారు. జయజయ ధ్వానాల మధ్య ప్రధాన ఆలయ ప్రవేశం జరిగింది. మహాకుంభ సంప్రోక్షణ శాస్రోక్తంగా ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులను వేద పండితులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. శోభాయాత్ర, విమాన గోపురాలకు పవిత్ర జలాలతో అభిషేకం, ఆలయ ప్రవేశం జరిగిన సమయంలో నమో నారసింహ మంత్రం ప్రతి ధ్వనించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రముఖులు, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events