మహేష్ బాబు కథానాయకుడిగా పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. కీర్తి సురేష్ కథానాయిక. వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం నుంచి ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రంలో మహేష్ ఓ రౌడీ గ్యాంగ్‌కు తన యాక్షన్‌ను రుచి చూపిస్తూ కనిపించారు. మహేష్ శైలికి తగ్గట్లుగా సాగే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అన్ని రకాల వాణిజ్య హంగులు పుష్కలంగా ఉంటాయి. ఇప్పటికే మొదటి సింగిల్ కళావతి పాటకి 50 మిలియన్లకు పైగా వీక్షణలతో అద్భుతమైన స్పందన వచ్చింది. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇందులో భాగంగా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు అని చిత్ర బృందం తెలియజేసింది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఫస్ల్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంగీతం: తమన్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, ఛాయాగ్రహణం: ఆర్.మధి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)