సుధీర్ బాబు కథానాయకుడిగా మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. బి.మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి నిర్మించారు. కృతిశెట్టి కథానాయిక. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సెప్టెంబరు 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హీరో మహేశ్‌బాబు చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ బాగుందన్న మహేష్ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు. లవ్, ఫ్యామిలీ డ్రామాగా సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తున్నది. వైద్యురాలైన కృతి శెట్టి.. హిట్ చిత్రాల దర్శకుడి సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా రూపొందించారు. అవసరాల శ్రీనివాస్, వెన్నుల కిషోర్, రాహుల్ రామకృష్ణ, తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)