తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో బీఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల సమావేశమయ్యారు. మహేష్ బిగాల కేటీఆర్‌తో వివిధ విషయాలపై చర్చించారు. ఈ పర్యటనలో తెలంగాణ వాళ్లే కాకుండా మిగతా రాష్ట్రాల ఎన్నారైలు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. కేసీఆర్ జాతీయ రాజకీయ రంగ ప్రవేశంపై వివిధ దేశాల్లో వున్నా అన్ని రాష్ట్రాల వారికీ తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో వివరించి మద్దతు కూడాబెడుతామని మహేష్ బిగాల అన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై వివిధ దేశాల ఎన్నారైల అభిప్రాయాలను వారి సూచనలను కేటీఆర్‌కు వివరించారు. మహేష్ బిగాల చేస్తున్న వివిధ కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)