నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో కవితకు టీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ ఎమ్మెల్సీగా కవిత ఎన్నికవడంతో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు భరోసా వచ్చినట్లయిందన్నారు. నిజామాబాద్ జిల్లాకి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. కవిత ఒక గొప్ప వ్యక్త, అన్ని రంగాలలో మంచి విషయ పరిజ్ఞానం ఉన్న వారు అని అన్నారు. ప్రజా సమస్యలపై ఎనలేని పోరాట స్వభావం ఉన్న నాయకురాలు కవిత అని కొనియాడారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)