టీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల జన్మదినం సందర్భంగా ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నారైల పక్షాన అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వివిధ కార్యక్రమాలను విజయవంతంగా చేస్తున్న మహేష్ బిగాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలను మహేశ్ బిగాల మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేశ్‌కు వారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారైలు శుభాకాంక్షలు తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)