Namaste NRI

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను క‌లిసిన మ‌హేశ్ బిగాల‌

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను బీఆర్‌ఎస్‌ గ్లోబల్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల నందినగర్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి ఎన్‌ఆర్‌ఐల తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహేశ్‌ బిగాల మాట్లాడుతూ తెలంగాణ ప్రదాత కేసీఆర్‌ను కలవడం ఆనందంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

Social Share Spread Message

Latest News