తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రగతి భవన్లో బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు మహేశ్ బిగాల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వివిధ దేశాల్లో ఉన్న అందరి తరపున సీఎంకు మహేశ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నారైల పక్షాన అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వివిధ కార్యక్రమాలను విజయవంతంగా చేస్తున్న మహేశ్ బిగాలను సీఎం కేసీఆర్ అభినందించారు.














