Skip to main content

Namaste NRI

అమెరికాలో కాగ్నిజెంట్‌కు భారీ ఎదురుదెబ్బ‌!

ప్రముఖ టెక్ దిగ్గజం, అమెరికా లో లిస్ట్ అయిన కాగ్నిజెంట్‌ కు అక్కడ భారీ ఎదురుదెబ్బ తగిలింది. వీసా మోసం ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా కొత్తగా గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌ ల కోసం దరఖాస్తు చేయకుండా కంపెనీపై యునైటెడ్ స్టేట్స్ కార్మిక శాఖ నిషేధం విధించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి ఎస్పోసిటో అధికారికంగా ప్రకటించారు.

కాగ్నిజెంట్‌తో పాటు మరో టెక్నాలజీ సంస్థ క్లౌడెరా పైనా ఇదే తరహా చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం ప్రకారం కాగ్నిజెంట్ కొత్తగా పీఈఆర్ఎం (ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్‌మెంట్) ఫైలింగ్స్ చేసేందుకు వీలుండదు. విదేశీ ఉద్యోగులకు శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) కోసం స్పాన్సర్ చేయాలనుకునే కంపెనీలు తప్పనిసరిగా కార్మిక శాఖ నుంచి ఈ లేబర్ సర్టిఫికేషన్‌ను పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియపైనే ఇప్పుడు సస్పెన్షన్ విధించడం గమనార్హం. ఈ పరిణామం కాగ్నిజెంట్‌పై ఆధారపడిన వేలాది మంది భారతీయ టెక్ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది.

Social Share Spread Message

Latest News