మహాకవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం శాకుంతలం. వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ నిర్మాతగా శాకుంతలం సినిమా రూపొందుతోంది. శకుంతల పాత్రలో కథానాయిక సమంత నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని మల్లికా మల్లికా మాలతీ మాలికా.. చూడవా చూడవా ఏడి నా ఏలిక అనే లిరికల్ సాంగ్ను విడుదల చేసింది చిత్రబృందం. దర్శకుడు మాట్లాడుతూ తన భర్త దుష్యంతుడి కోసం ఎదురుచూసే శకుంతల తన చుట్టూ వున్న మొక్కలు, పక్షులతో మనసులోని బాధను అందంగా వ్యక్తం చేసే పాట ఇది. పాటతో పాటు విజువల్స్ కూడా ఎంతో గ్రాండ్గా వుంటాయి. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 17న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అన్నారు.
మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రంలోని ఈ పాటను చైతన్య ప్రసాద్ రాయగా.. రమ్య బెహ్రా ఆలపించారు. శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి ప్రవీణ్ పూడి ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణి శర్మ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని విజువల్గానే కాకుండా మ్యూజికల్గానూ ఆడియెన్స్కు ఆమేజింగ్ ఎక్స్పీరియెన్స్ ఇవ్వటానికి రీ రికార్డింగ్ను బుడాపెస్ట్, హంగేరిలోని సింఫనీ టెక్నీషియన్స్ చేయటం విశేషం. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటుంది.