Namaste NRI

శాకుంతలం నుంచి మల్లిక మల్లిక సాంగ్‌

సమంత ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక నేపథ్య సినిమా శాకుంతలం. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్‌ రూపొందించారు. ఇందులో దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, అదితీ మోహన్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.   తాజాగా ఈ చిత్రం నుంచి మల్లికా మల్లికా మాలతీ మాలికా అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఒక నిమిషం 12 సెకన్లపాటు ఉన్న తాజా మెలోడి ట్రాక్‌ మ్యూజిక్‌ లవర్స్‌ను ఆకట్టుకుంటూ సాగుతోంది.  ఈ పాటను మణిశర్మ స్వరపర్చగా చైతన్య ప్రసాద్‌ సాహిత్యాన్ని అందించారు. రమ్య బెహరా పాడారు. ఈ పాట విడుదల సందర్భంగా దర్శకుడు గుణశేఖర్‌ మాట్లాడుతూ ఇది తనకు ఇష్టమైన పాట అని సమంత చెబుతుంటుంది. ఈ పాట ఆడియో ఎంతగా ఆకట్టుకుంటుందో విజువల్‌గా తెరపై అంతే ఆనందాన్ని కలిగిస్తుంది  అన్నారు. శాకుంతలం ప్రపంచవ్యాప్తంగా  తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 14న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events