
రాజకీయాల్లోనే కాదు, రోజువారీ కార్యక్రమాల్లోనూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. తన రోజూవారి దినచర్యను జాగింగ్‌తో ప్రారంభించే దీదీ, విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా ఇదే అలవాటును అనుసరిస్తుంటారు. ప్రస్తుతం లండన్ పర్యటనకు వెళ్లిన బెంగాల్ సీఎం, అక్కడ పార్క్‌లో తన బృందంతో కలిసి జాగింగ్ చేశారు. స్థానిక హైడ్ పార్క్ లో చీర, రబ్బరు చెప్పులతో తన ఉదయపు నడకకను ప్రారంభించి జాగింగ్ చేశారు. భద్రతా సిబ్బంది వెంట రాగా మమత జాగింగ్ చేశారు.

మమతా బెనర్జీ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటూ, ఆయా సందర్భాల్లో అవగాహన కల్పించిన విషయం తెలిసిందే. ఆరోగ్యంపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తుంటారు. ఇక విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు దీదీ ఇలా జాగింగ్ చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో స్పెయిన్, డార్జిలింగ్ తదితర దేశాలకు వెళ్లినప్పుడు ఉదయం ఇలానే చీర, రబ్బరు చెప్పులతో జాగింగ్ చేశారు.
