పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ భవానీ పూర్ ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించారు. ప్రతి రౌండ్‌లోనూ మమత ఆధిక్యం చాటుకుని 58,835 ఓట్ల తేడాతో గెలిచారు. సౌత్ కోల్‌కతాలోని ఈ భవానీపూర్ స్థానంలో మమత బెనర్జీకి 85,263 ఓట్లు వచ్చాయి. సమీప బీజేపీ ప్రత్యర్థి ప్రియాంక టిబ్రెవాల్‌కు 26,428 ఓట్లు రాగా సీపీఎం అభ్యర్థి స్రిజిబ్ బిశ్వాస్‌కు 4226 ఓట్లు దక్కాయని ఎన్కిల సంఘం ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగే దిశలో భవానీపూర్ స్థానంలో విజయం మమతకు తప్పనిసరి అయింది. ఈ దిశలో ఆమె గెలుపు భారీ స్థాయిలో ఆధిక్యతతో తన వ్యక్తిగత ఇమేజ్‌ను తిరుగులేకుండా చేసుకున్నారు.