మమ్ముట్టి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భ్రమయుగం. సదాశివన్ దర్శకుడు. నైట్‌షిప్ట్ స్టూడియో పతాకంపై చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేశారు మమ్ముట్టి. కొచ్చి పరిసర ప్రాంతంలో జరిగిన భారీ షెడ్యూల్‌లో కీలక ఘట్టాలను తెరకెక్కించామని చిత్రబృందం పేర్కొంది. అక్టోబర్‌లో షూటింగ్ మొత్తం పూర్తికానుంది. హారర్ థ్రిల్లర్ కథాంశంతో భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది.
