తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన ఊరు`మన బడి కార్యక్రమానికి విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైల నుంచి మంచి స్పందన వస్తుంది. వరంగల్‌లో జరిగిన సాఫ్ట్‌పత్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎన్నారై రవిచందర్ రెండు పాఠశాలలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో రూ.20 లక్షల చెక్‌ను మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్నారై రవిచంద్రన్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. అనంతరం మహేశ్ బిగాల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తలబెట్టిన మంచి కార్యక్రమానికి అందరి సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో ఎన్నారైల భాగస్వామ్యం ఉండేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్, వరంగల్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)