మోహన్‌బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటిస్తున్న సినిమా అగ్ని నక్షత్రం. తొలిసారి ఈ చిత్రంలో తండ్రీ కూతురు కలిసి నటిస్తున్నారు. సముద్ర ఖని, చైత్ర శుక్ల ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పోలీస్ట్ స్టోరీగా రూపొందుతోన్న చిత్రం ఇది. చిత్రీకరణ తుది దశలో ఉందీ సినిమా. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటించారు. ఇదొక భిన్నమైన చిత్రమవుతుందని, మోహన్ బాబు, మంచు లక్ష్మీ పాత్రలు కొత్త తరహాలో ఉంటాయని చిత్ర బృందం చెబుతున్నారు. జబర్దస్త్ మహేష్, విశ్వంత్, మలయాళ నటుడు సిద్దిఖ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. డైమండ్ రత్నబాబు అందించిన కథతో ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి కథ : డైమండ్ రత్నబాబు, సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి, ఎడిటర్ : మధురెడ్డి, సంగీతం: లిజో కె జోస్.














