మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ఆదిపర్వం. అన్వికా ఆర్ట్స్, ఎ.వన్ ఎంటర్‌టైన్ మెంట్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్నది. ఐదు భాషల్లో వెలువడనున్న ఈ సినిమాకు సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. 1974 నుంచి 1992 మధ్య జరిగే నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ డ్రామాలో మంచు లక్ష్మి నాగలాపురం నాగమ్మగా కనిపించనున్నది. కథలో భాగంగా మంచు లక్ష్మి ఎంతో రిస్క్‌తో రెండు పోరాట ఘట్టాల్లో పాల్గొన్నారని, ఈ ఫైటింగ్స్ సినిమాకు హైలైట్ అని, గ్రాఫిక్స్ వర్క్ చివరి దశకు చేరుకుందని దర్శకుడు తెలిపారు.
ఈ సినిమాలో ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, వెంకట్ కిరణ్, యోగికాత్రి, గడ్డం నవీన్, ఢిల్లీ రాజేశ్వరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సినిమా గ్రాఫిక్స్ వర్క్ చివరిదశకు చేరుకుందని ఇప్పటివరకూ వచ్చిన ఔట్ పుట్ చాలా బాగుందని ఎగ్జిక్యూ టివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాస్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌ఎన్.హరీశ్, సంగీతం: మాధవ్ సైబా, సంజీవ్ మేగోటి, బి.సుల్తాన్ వలి, ఓపెన్ బనానా, లుబెక్ లీ మార్విన్, నిర్మాత: ఎంఎస్‌కే, రచన-దర్శకత్వం: సంజీవ్ మేగోటి.