సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు, ఆయన కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటించిన తొలిచిత్రం అగ్ని నక్షత్రం. వంశీకృష్ణ మళ్ల దర్శకుడు. మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ నిర్మిస్తున్నారు. సముద్రఖని, యువ హీరో విశ్వంత్, చిత్ర శుక్లా, మలయాళ నటుడు సిద్ధిక్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా గ్లింప్స్‌ను వాలెంటైన్స్ డే సందర్భంగా నటుడు దగ్గుబాటి రానా విడుదల చేశారు. వీడియో చూస్తుంటే ఇదొక పోలీస్ స్టోరీ అని అర్థం అవుతుంది. ఇందులో ప్రొఫెసర్ విశ్వామిత్ర అనే డిఫరెంట్ క్యారెక్టర్‌లో మోహన్ బాబు కనిపిస్తుండగా, మంచు లక్ష్మి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. దర్శకుడు మాట్లాడుతూ గ్లింప్స్‌కు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు కథ అందించారు. మధురెడ్డి ఎడిటర్ గా లిజో కె జోస్ సంగీతం, గోకుల్ భారతి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు.