యూఏఈలోని భారత ఎంబసీ అక్కడి నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. యూఏఈ నుంచి భారత్‌కు వెళ్లేవారు ప్రయాణానికి 72 గంటల ముందు టెస్టు చేయించుకున్న ఆర్‌టీ`పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు చూపించడం తప్పనిసరి అని పేర్కొంది. అలాగే ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని తెలియజేసింది. అయితే కొవిడ్ పరీక్ష తాలూకు నెగెటివ్ రిపోర్టు లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను ప్రయాణికులు తప్పనిసరిగా ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. కాగా, టీకా దృవపత్రాన్ని అప్‌లోడ్ చేసే సౌకర్యం కేవలం 82 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రమే భారత్ కల్పించింది. ఈ జాబితాలో యూఏఈ లేదు. కనుక యూఏఈ ప్రయాణికులు ఆర్‌టీ`పీసీఆర్ నెగెటివ్ రిపోర్టును ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం తప్పనిసరి అని ఎంబసీ తెలిపింది. దీంతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్‌కు సమర్పించాలి.