బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ ను బాలీవుడ్ స్టార్ నటి మనీషా కోయిరాల కలిశారు. యూకే – నేపాల్ బంధానికి 100 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ లో ప్రత్యేక వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు మనీషా కోయిరాల నేపాల్ తరఫున హాజరయ్యారు. ఈ వేడుకలో పాల్గొనడం తనకు ఎంతో గౌరవంగా ఉందన్నారు. నేపాల్ గురించి బ్రిటన్ ప్రధాని ఎంతో అభిమానంగా మాట్లాడటం తనకు చాలా ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు ట్రెక్కింగ్‌కు రావాలని పీఎం, ఆయన కుటుంబాన్ని ఆహ్వానించినట్లు మనీషా వెల్లడించారు.
కాగా, కొన్నేళ్ల విరామం తర్వాత సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి లో మనీషా కోయిరాల కనిపించారు. ఈ సినిమాలో మల్లికాజాన్ పాత్రలో ప్రేక్షకులను అలరించారు. ఆమెతోపాటు సొనాక్షి సిన్హా, రిచా చద్ధా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్, అదితిరావ్ హైదరి, తదితరులు కీలపాత్రలు పోషించారు.