Namaste NRI

బ్రిటన్‌లో మనోళ్లదే అగ్రస్థానం

 బ్రిటన్‌ మంజూరు చేసే అన్ని రకాల వీసాల్లో భారతీయుల హవానే కనిపిస్తున్నది. స్టూడెంట్‌ వీసా, మెడికల్‌ ప్రొఫెషనల్స్‌ వీసా, పర్యాటక వీసా ఇలా ఏ క్యాటగిరీలోనైనా భారతీయులే ఎక్కువ వీసాలు దక్కించుకొంటు న్నారు. ఈ ఏడాది వీసాల డాటాను (సెప్టెంబర్‌ 2023 నాటికి) బ్రిటన్‌ హోం శాఖ విశ్లేషించగా, ఆరోగ్య రంగ నిపుణులు, స్టూడెంట్‌ ఇలా పలు క్యాటగిరీల వీసాల్లో భారతీయులే తొలిస్థానంలో ఉన్నట్టు తేలింది. నైపుణ్య కార్మికులు-ఆరోగ్య నిపుణుల వీసాల్లో  భారతీయులకు 38,866, నైజిరియన్లకు 26715, జింబాబ్వేనియన్లను 21, 130 వరకూ వీసాల అవకాశం కల్పించారు. ఇంతకు ముందటి ఏడాదితో పోలిస్తే ఇటువంటి వీసాల సంఖ్య భారీగా పెరిగిందని హోం శాఖ తెలిపింది. 

ఇక విద్యార్థి వీసాల విషయానికి వస్తే భారతీయ విద్యార్థులకు జారీ అయిన వీసాల సంఖ్య 1,33,237 వరకూ ఉంది. టూరిస్టు వీసాల విషయంలో భారతీయులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ లకు ఎక్కువగా సందర్శక వీసాలు దక్కినట్లు వెల్లడైంది. మొత్తం టూరిస్టు వీసాల విషయానికి వస్తే భారతీయులకు ఎక్కువగా అంటే 27 శాతం వరకూ జారీ చేశారు. తరువాతి స్థానంలో చైనాకు 19 శాతం, టర్కీజాతీయులకు 6 శాతం వీసాలు లభించాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events