Namaste NRI

మనోరథంగల్‌ ట్రైలర్‌ విడుదల

మలయాళ సాహితీ దిగ్గజం వాసుదేవన్‌ నాయర్‌ 90వ పుట్టిన రోజుని పురస్కరించుకొని ఆయన రాసిన తొమ్మిది కథలతో రూపొందించిన వెబ్‌సిరీస్‌ మనోరథంగల్‌. 9మంది అగ్ర హీరోలు, 8మంది లెజెండరీ దర్శకులతో ఈ వెబ్‌ సిరీస్‌ రాబోతున్నది. ఆగస్ట్‌ 15న ప్రీమియర్‌ను ప్రదర్శించబోతున్నారు. ట్రైలర్‌ను విడుదల చేశారు. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌కానుంది.ఈ సిరీస్‌లో మమ్ముట్టి, మోహన్‌ లాల్‌, ఫహద్‌ ఫాజిల్‌, జరీనా, బిజు మీనన్‌, కైలాష్‌, ఇంద్రన్స్‌, నేడుముడి వేణు వంటి అగ్ర నటులు భాగమ య్యారు. అగ్ర నటుడు కమల్‌హాసన్‌ ఈ కథల్ని ప్రేక్షకులకు పరిచయం చేసే నేరేటర్‌గా ఈ సిరీస్‌లో కనిపించ నున్నారు. ప్రియదర్శన్‌, రంజిత్‌, శ్యామ్‌ప్రసాద్‌, జయరాజన్‌ నాయర్‌, సంతోష్‌శివన్‌, రతీష్‌ అంబట్‌, అశ్వతి నాయర్‌ దర్శకత్వం వహించారు.

సాహితీ దిగ్గజం వాసుదేవన్‌ నాయర్‌పై గౌరవంతో ఈ సిరీస్‌ను రూపొందించామని మేకర్స్‌ తెలిపారు. ఈ సిరీస్‌లో రెండు కథలకు దర్శకత్వం వహించానని, వాసుదేవన్‌ నాయర్‌ కథలను డైరెక్ట్‌ చేయాలన్న తన డ్రీమ్‌ ఈ సినిమాతో తీరిందని ప్రియదర్శన్‌ తెలిపారు. తన అభిమాన రచయిత రాసిన కథలో నటించడం ఆనందంగా ఉందని మమ్ముట్టి తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events